ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చట్టం తని పని తాను చేసుకుంటూ వెళుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారని, అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్‌పై తానేమీ మాట్లాడనని అన్నారు. ఏసీబీకు పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనని.. తీగ లాగితే డొంక కదులుదుందని అన్నారు. ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.