ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ సమావేశంలో నాగబాబు ప్రమాణస్వీకార తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల తుది జాబితా, ఇతర అంశాలపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘనవిజయంపై చర్చ జరుగుతోంది.