తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. రైతుల మీద చర్చ పెడదాం అంటే.. పర్యాటక శాఖ మీద చర్చ పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెండే పర్యాటకాలు అని.. ఒకటి ఢిల్లీకి ఎక్కే పర్యాటకం, రెండూ దిగే పర్యాటకం అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి పోయారన్నారు. అయినా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకుని రాలేదని కేటీఆర్ విమర్శించారు.