తిరుమలలో కలకలం సృష్టించిన చిరుత.. ఐదేళ్ల బాలుడిపై దాడి

స్వతంత్ర వెబ్ డెస్క్:తిరుమల నడక మార్గంలో 5 సంవత్సరాల బాలుడిపై చిరుత దాడి చేసింది. మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత కలకలం సృష్టించింది. ఘాట్‌రోడ్డులోని 7వ మైలు దగ్గర బాలుడిపై చిరుత దాడి చేసింది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కర్నూలు జిల్లా అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. ఆ తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడేమో ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.

దీంతో, స్థానికులు, భద్రతాసిబ్బంది, తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు, వేస్తూ రాళ్లు రువ్వుతూ, కేకలు వేస్తూ చిరుతను బెదిరించారు. దీంతో, కంగారు పడ్డ చిరుత బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలను వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్