ఖిలా వరంగల్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్తీక్ సెలవుపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజేశ్‌కు గత నెల 23న ఇన్‌ఛార్జ్ బాధ్యత లు అప్పగించారు. ఈనేపథ్యంలోనే ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలోని 44వ డివిజన్‌లో ఒక అక్రమ లేఅవుట్ ప్లాట్లకు రాజేశ్ రిజిస్ట్రేషన్ చేశారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విభజించినప్పుడు ప్రతి ప్లాటుకు నాలా పర్మిషన్ తీసుకోవాలి. కానీ, మొత్తానికి పర్మిషన్ తీసుకొని వాటిని భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. వాటిలో లోపాలు ఉన్నాయని గుర్తించి రాజేశ్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు.
ఖిలా వరంగల్ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ సస్పెండ్
0
329
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


