జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లో వృద్ధులు లేవడానికి సాయంగా కట్టిన చీరకు ప్రమాదవశాత్తు ఉరిపడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు సంపత్ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల మూడవ తరగతి పూర్తి చేశాడు. సంపత్ తన తమ్ముడు గణేశ్‌తో కలిసి ఆడుకుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బాత్‌రూమ్‌లో చీర పట్టుకొని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు ఉరి బిగుసుకుంది. దీంతో ఊపిరాడక సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో విషాదం
0
382
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


