24.7 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

దూకుడుగా ఆడిన సన్ రైజర్స్

   ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా మండు వేసవిలో అభిమానులను అద్భుత ఆటతీరుతో అలరించిన లీగ్‌లో ఆఖరి ఆటకు వేళయైంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ పోరులో కదం తొక్కనున్నాయి. చెపాక్‌ స్టేడియం వేదికగా కప్‌ కోసం ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడనున్నాయి. ముఖాముఖి పోరులో హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయిగా కనిపిస్తున్నా, ఆఖరి ఆటలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలుస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

    ఐపీఎల్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూసే క్షణం వచ్చేసింది. గెలుస్తుందన్న మ్యాచ్‌లో ఓడిపోవడం, ఓడిపోతుందనే మ్యాచ్‌లో గెలవడం వంటి ఆశ్చర్యాలను చూసిన ఫ్యాన్స్ మరో ఆసక్తికర పోరు చూసేందు కు రెడీ అవుతున్నారు. 2024 ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌పై అటు అభిమానులు. ఇటు విశ్లేషకులు ఎవరికివారు తమ తమ అంచాలు వేసుకుంటున్నారు.

రెండు నెలల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అత్యుత్తమం అన్నదగ్గ రెండు జట్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కప్‌ వేటలో తలపడబోతున్నాయి. ఆదివారం చెపాక్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడేందుకు సర్వశక్తులతో కదనరంగంలోకి దూకనున్నాయి. లీగ్‌ ఇరు జట్లు ముఖాముఖి పోరుతో మొదలుపెట్టగా, చివరగా అవే జట్లు ఇప్పుడు తుది పోరులో సత్తాచాటేందుకు సై అంటున్నాయి. లీగ్‌లో రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఎదురైన ఓటములకు ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ కదన కుతుహలంతో ఉంటే, కోల్‌కతా తీన్మార్‌ మోగించేందుకు తహతహలాడుతున్నది. 17 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్‌ చరిత్రలో హైదరాబాద్‌, కోల్‌కతా పైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. 277, 287 రన్స్‌తో ఐపీఎల్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూకుడుతో SRH ఫైనల్స్‌కు చేరింది. 2016లో ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సన్‌రైజర్స్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి, మంచి రన్ రేట్‌తో పాయింట్ల టేబుల్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ విన్నర్‌ కావాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో 2012,2014 సీజన్లలో టైటిళ్లు సొంతం చేసుకుంది. కేకేఆర్ ప్రత్యర్థి SRH సైతం 2009, 2016లలో ఐపీఎల్ విన్నర్‌గా నిలిచింది.

ఈ సీజన్‌లో రెండుసార్లు నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్‌లు జరిగితే SRH రెండింటిలోనూ ఓటమి చవిచూ సింది. మరో వైపు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఆడిన 27 మ్యాచ్‌లలో 18 సార్లు కేకేఆర్ గెలిస్తే, 9 సార్లు SRH విజయం సాధించింది. ట్రాక్ రికార్డులు SRH ఫ్యాన్స్‌ను కొంత కలవర పెడుతున్నా ఈసారి టీమ్ పెర్ఫార్మెన్స్ దూకుడుతో ఉండడంతో గెలిచేది రైజర్స్ అంటున్నారు. మరి కొన్ని గంటల్లో మొదలయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్