నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షోలో కోలీవుడ్ హీరో సూర్య సందడి చేయబోతున్నారు. ఆయనతో పాటు యానిమల్ విలన్ బాబీడియోల్ కూడా కనిపిస్తారు. కంగువ ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరు ఈ టాక్‌షోకు హాజరయ్యారు. సూర్య, బాబీ డియోల్ ఎపిసోడ్ షూటింగ్ ఇవాళ జరిగింది. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఏం నారా చంద్రబాబునాయుడు వచ్చారు. రేపు రాత్రి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతోంది. చంద్రబాబునాయుడు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ ఎపిసోడ్ చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఈ టాక్ షో షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోకు సూర్యతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరో బాడీ డియోల్ వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్‌స్టాపబుల్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో లావిష్‌గా తీర్చిదిద్దారు. కంగువ తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగానే సూర్య అన్‌స్టాపబుల్ విత్ NBK షోకు హాజరయ్యారు. అతడితో పాటు కంగువ మూవీ విశేషాలతో పాటు తన కెరీర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్‌లో అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో సూర్య పంచుకోబోతున్నారు. జ్యోతికతో ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.