సమంత సంచలన నిర్ణయం..?

సమంత.. కెరీర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈమధ్య మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. మా ఇంటి బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. సమంత ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. సమంత తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి..?

ఏమాయ చేసావే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన సమంత అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దూకుడు, బృందావమనం, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం.. తదితర చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో మెప్పించింది. అయితే.. స్టార్ హీరోల సరసన గ్లామరస్ క్యారెక్టర్స్ తో మెప్పించిన సమంత ఇప్పుడు కెరీర్ ను సరికొత్త రూటులోకి తీసుకెళ్లబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కమర్షియల్ సినిమాలకు, సాంగ్స్ కు పరిమితమయ్యే సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యిందట.

సినిమాలో కథే అసలైన హీరో అని సామ్ బలంగా నమ్ముతుంది. స్టార్ హీరోల సినిమాల్లో భాగం కావడం కంటే.. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లో నటించాలని.. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని అనుకుంటుందట. లేటెస్ట్ గా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషించింది. ఒక సామాన్య మహిళ ఎదుర్కొనే సవాళ్లు, ఆమె సాధించే విజయాల చుట్టూ మా ఇంటి బంగారం కథ తిరుగుతుందని సమాచారం. టైటిల్ వినడానికి సాఫ్ట్ గా ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది.

యూ టర్న్, ఓ బేబీ, యశోద, మా ఇంటి బంగారం.. ఇలా డిఫరెంట్ మూవీస్లో నటించిన సమంత.. ఇక నుంచి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రాధాన్యం ఇవ్వబోతుంది. స్టార్ ఇమేజ్, క్రేజ్ ఉన్న సామ్.. కమర్షియల్ సినిమాలకు నో చెప్పాలనుకోవడం.. సంచలన నిర్ణయమే. దీని వలన రైటర్స్ అండ్ డైరెక్టర్స్ సామ్ ని దృష్టిలో పెట్టుకుని లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సంబంధించి కథలు రాసే ఛాన్స్ ఉంటుంది. మరి.. సామ్ తీసుకున్న నిర్ణయం వలన తన కెరీర్లో.. అలాగే ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

Latest Articles

రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు

విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్‌ ముస్సోరీలోని హోమ్‌ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్