గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో పర్యటించిన ఆమె.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నామన్నారు. ఇకపై ఏజెన్సీల్లో డోలీ మోతలు ఉండవన్నారు. రాష్ట్రంలో డయేరియా మరణాలు నమోదవుతుండడంతో.. క్లోరినేషన్ ప్రక్రియ ప్రతిచోటా నిర్వహించాలన్నారు. డయేరియా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు హోంమంత్రి అనిత.