మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు మాజీఎంపీ మార్గాని భరత్. మోరంపూడి ఫ్లైఓవర్ కోసం పార్లమెంట్‌లో చాలాసార్లు పోరాటం చేశానన్నారు. ఫ్లై ఓవర్‌ను ప్రారంభోత్సవం చేశారు కానీ.. లైట్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఫ్లై ఓవర్‌పై లైట్లు ఏర్పాటు చేయకపోతే వైసీపీ తరపున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఫ్లైఓర్‌పై ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. జాతీయ రహదారులపై బ్రాందీ షాపులు పెట్టడం చట్టానికి విరుద్ధమని… వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.