మూసీ పేరుతో భారీగా అవినీతికి ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించిన ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ లక్ష కోట్ల రూపాయలను దోచుకుందని ఆరోపించిన బండి సంజయ్.. మూసీ పేరుతో లక్షల కోట్లు అప్పు తెచ్చి కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా గగనమైందని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆయన.. కాంగ్రెస్ దోపిడీ, పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్నారు.