Site icon Swatantra Tv

జనగామ జిల్లా గానుగుపహాడ్‌ గ్రామంలో విషాదం

     జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లో వృద్ధులు లేవడానికి సాయంగా కట్టిన చీరకు ప్రమాదవశాత్తు ఉరిపడి ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు సంపత్ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల మూడవ తరగతి పూర్తి చేశాడు. సంపత్ తన తమ్ముడు గణేశ్‌తో కలిసి ఆడుకుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో బాత్‌రూమ్‌లో చీర పట్టుకొని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు ఉరి బిగుసుకుంది. దీంతో ఊపిరాడక సంపత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version