రసవత్తరంగా మారిన కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం

     కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కామారెడ్డి మున్సిపల్​ చైర్​పర్సన్​పై అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్​పర్సన్ భవితవ్యం ఆధారప డిఉంది. అవిశ్వాసం మీద ఓటింగ్​ కోసం కలెక్టర్​ ఈనెల 30న సమావేశాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. కాంగ్రెస్​ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలముంది. అవిశ్వాసం మీద ఓటింగ్​ కోసం మీటింగ్​ నిర్వహించాలంటే 34 మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సిఉంటుంది. కోరం పూర్తి కావాలంటే మరో ఏడుగురు హాజరుకావాలి. దీంతో కాంగ్రెస్​ నేతలు బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

     రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ….. కామారెడ్డి మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. దానికోసం మున్సిపాలిటీలో నలుగురు ఉన్న తమ బలాన్ని 27కు పెంచుకుంది. 27 మంది కౌన్సిలర్లతో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కలెక్టర్‌కు కౌన్సి లర్లు తీర్మానం అందజేయగా ఈ నెల 30న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు. ఇప్పటికే 27 మంది కౌన్సిలర్లతో పాటు తమకు మద్దతుగా నిలిచే మరో ఏడుగురు కౌన్సిలర్లను గోవా క్యాంపుకు తరలించింది. ఈనెల 30న క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. దాంతో కామారెడ్డి మున్సిపా లిటీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. క్యాంపులో ఉన్న బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లతో ఇప్పటికే సంప్రదిం పులు జరిపినట్లు చెప్తున్నారు. ​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్​ వైన్​ చైర్​పర్సన్​తోపాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​లో 16 మంది మిగిలారు. ఇందులో 9 మంది చైర్​ పర్సన్​ నిట్టు జాహ్నవి పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారు వారం రోజులుగా క్యాంపులో ఉన్నారు. అసమ్మతి వాదులు పరోక్షంగా కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్​కు గైర్హాజరయ్యేలా చూడాలని చైర్​పర్సన్​ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్