తెలంగాణలో కులగణనకు చట్టబద్దత ఉందోలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నేతలతో కలిసి కవిత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావుకు ‘బీసీల సమగ్ర అధ్యయన నివేదిక’ను అందజేశారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు.
బీసీలకు రాజకీయ, ఆర్ధిక న్యాయం ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందని, కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో చెప్పిందని.. ఆ పార్టీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిందని… బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయని రేవంత్ సర్కార్.. నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నించారు.