కాళేశ్వరంపై జస్టిస్‌ కమిషన్‌ విచారణ వేగవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి డొంకను కదిలించేందు క్రమంలో జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకూ సాంకేతిక లోపాలపై దష్టిసారించిన కమిషన్‌.. ప్రస్తుతం ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు అధికారుల నుంచి వివరాలు రాబడుతోంది. ఇందులో భాగంగానే మాజీ సీఎస్, ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల మాజీ కార్యదర్శులను విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. మాజీ సీఎస్​ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ సెక్రటరీలుగా పని చేసిన ఎస్కే జోషి, రజత్​కుమార్, స్మితా సబర్వాల్ కు కమిషన్ నోటీసులు అందజేసినట్టు సమాచారం. అదే విధంగా ఆర్థికపరమైన అంశాలను తెలుసుకునేందుకు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్​రాజ్, నాగిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీళ్లందరికీ కమిషన్​ చైర్మన్​ జస్టిస్ పీసీ ఘోష్​ నోటీసులు పంపారని, ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

టెండర్లు పిలిచిన విధానం? ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి? ఏ ప్రాతిపదికన టెండర్లు ఇచ్చారు? కాంట్రాక్ట్​లు ఇచ్చాక మళ్లీ సబ్​కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరమేంటి? తదితర అంశాలపై ఆరా తీస్తోంది కమిషన్‌. ఇక ఆర్థిక శాఖ అధికారుల నుంచి ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత అంచనా వ్యయాలు ఎంతమేర పెరిగాయి? ఎందుకు పెంచాల్సి వచ్చింది? కాంట్రాక్ట్​సంస్థలకు ఎంత చెల్లించారు? సబ్​కాంట్రాక్ట్​సంస్థలకు చెల్లింపులు తదితర వివరాలను కూడా ఈ విచారణలో రాబట్టనుంది.

Latest Articles

దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్