స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. సొంతింటి పండుగను ఏపీ ప్రజలకు అందించనున్నారు సీఎం జగన్. ఇవాళ ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ పేదల చేతికి ఇళ్లు అందించనున్నారు. ఈ లెక్కన ప్రతి మహిళ చేతికి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తి అందించనున్నారన్న మాట. ఇక ఇవాళ సామర్లకోటలో ఈ ఇళ్ల ప్రారంభోత్సవం ఉండనుంది. అక్కడ 2 వేలకు పైగా ఇళ్లల్లో గృహప్రవేశాలు జరుగనున్నాయి. స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్…ఒకేరోజు ఏపీ వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు ప్రారంభించనున్నారు. కాగా, మొన్న పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమించారు వైయస్.జగన్. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించారు వైస్.జగన్.
ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త..నేడు ఒకేరోజు 5 లక్షల ఇళ్లు ప్రారంభం
0
307
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


