స్వతంత్ర వెబ్ డెస్క్: రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. జైలు జీవితం గడుపలేక చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత నెలకొందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. రాజమండ్రి జైలులో డీహైడ్రేషనుతో ఇబ్బంది పడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు చంద్రబాబు గురయ్యారు. దీంతో వైద్యులకు సమాచారం ఇచ్చిన చంద్రబాబు…తనకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరారట. అయితే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు డిహైడ్రేషన్ కు గురవడంతో ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఆ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ స్పందించారు. ‘జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది. చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు’ అని తెలిపారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది: జైలు సూపరింటెండెంట్
0
455
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


