చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. నవీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనే డిసైడ్ చేసుకోవాలని అన్నారు. చింతపండు నవీన్ గెలుపుకోసం తాము కష్టపడ్డామని.. కులగణన ఫామ్‌కు నిప్పు పెట్టడం దుర్మార్గపు చర్య అని ఆమె మండిపడ్డారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ,పద్మారావులు కుల గణన సర్వేలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. సర్వే లో పాల్గొనని వారికి కులగణనపై మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో తొలిసారి కులగణన చేశామని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ లిమ్ కా బుక్‌లో చోటుకోసం సర్వే ఫారాలు పంపారు. కానీ వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదు? దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు. దేశంలో స్వాతంత్రం వచ్చాక మొదటి సారి కులగణన జరిగింది. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ కు ప్రాధాన్యత లేదు”.. అని సీతక్క అన్నారు.