ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఇప్పటివరకు మొత్తం ఎన్ని పతకాలు వచ్చాయంటే?

స్వతంత్ర వెబ్ డెస్క్:  చైనా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. క్రీడల్లో భాగంగా తొమ్మిదరోజు (అక్టోబర్‌ 2) అథ్లెటిక్స్‌తో పాటు, టేబుల్ టెన్నిస్, రోలర్ స్కేటింగ్‌ విభాగాల్లో భారత్ పతకాలు సాధించింది. ఇక హాకీలోనూ భారత జట్టు సత్తాచాటింది. అయితే ఈ రోజు భారత్‌కు ఒక్క బంగారు పతకం కూడా రాలేదు. మొత్తం మ్మీద తొమ్మిదో రోజు ముగిసిన తర్వాత, భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 60కి పెరిగింది. ఇందులో 13 బంగారు పతకాలు కాగా, 24 రజత పతకాలు, అలాగే 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ఉన్నాయి. సోమవారం ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు మొత్తం మూడు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత్‌కు చెందిన పరుల్ చౌదరి, ప్రీతి పతకాలు సాధించారు. పారుల్ రజత పతకాన్ని గెలుచుకోగా, ప్రీతి కాంస్యాన్ని గెలుచుకుంది. ఇర 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు చెందిన ముహమ్మద్ అజ్మల్, విద్యా రామ్‌రాజ్, రాజేష్ రమేష్, శుభా వెంకటేశన్ మూడవ స్థానంలో నిలిచారు. అయితే శ్రీలంక జట్టు పొరపాటు చేయడంతో భారత్‌కు ప్రయోజనం లభించింది. కాంస్య పతకాన్ని రజతంగా మార్చారు. లాంగ్ జంప్‌లో భారత్‌కు చెందిన అన్సీ సోజన్ 6.63 మీటర్లు దూకి రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. ఇదే ఈవెంట్‌లో శైలీ సింగ్ కూడా 6.49 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచింది.

రోలర్ స్కేటింగ్‌లో పతకం ..
రోలర్ స్కేటింగ్‌లోనూ భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. పురుషుల, మహిళల 3000 మీటర్ల టీమ్ రిలే రెండింటిలోనూ భారత్ పతకాలు సాధించింది. కార్తీక్ జగదీశ్వరన్, హీరాల్ సాధు, ఆర్తి కస్తూరి రాజ్‌లతో కూడిన మహిళల జట్టు స్పీడ్ స్కేటింగ్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించింది. అనంత్ కుమార్ వెల్‌కుమార్, సిద్ధాంత్ కాంబ్లే, విక్రమ్ ఇంగాలేలతో కూడిన పురుషుల జట్టు కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. టేబుల్ టెన్నిస్ లోనూ భారత్ పతకం సాధించింది. సుతీర్థ ముఖర్జీ, అహికా ముఖర్జీల జోడీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఇక బంగ్లాదేశ్‌పై భారత హాకీ జట్టు పటిష్ట ప్రదర్శన కనబర్చి అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 12-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు, నాలుగు, 32వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. 18, 24, 46 నిమిషాల్లో మన్‌దీప్‌ గోల్స్‌ చేశాడు. 23వ నిమిషంలో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, 28వ నిమిషంలో అమిత్ రోహిదాస్, 41వ నిమిషంలో అభిషేక్ గోల్స్ చేశారు. వీరితో పాటు 47వ నిమిషంలో నీలకంఠ శర్మ, 56వ నిమిషంలో గుర్జాంచ్ సింగ్ గోల్స్ చేశారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్