వారాహి యాత్రలో ఏ దాడి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- పవన్ కళ్యాణ్

స్వతంత్ర వెబ్ డెస్క్:  వారాహి యాత్రలో ఏ దాడి జరిగినా జగన్ ప్రభుత్వానిదే బాధ్యత అని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. కృష్ణా జిల్లాలో జరిగిన జనవాణి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  జన సైనికులపై రాళ్ల దాడి చేసినా.. క్రిమినల్ ఎటాక్ చేసినా ఏం చేసినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రలకు విఘాతం కలిగితే డీజీపే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

సీఎం జగన్ పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ చూపిస్తే ఊరుకోం. ఎవరైనా జేబులోంచి ఏమి తీసినా చుట్టూ పక్కల మద్దతుదారులు వారిని బందించండి అని జన సైనికులకు సూచించారు పవన్ కళ్యాణ్. పెడనలో వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. అమలాపురం మాదిరిగా గొడవలు సృష్టించాలని కుట్ర పనుతున్నారని పేర్కొన్నారు. దాడులు చేయడానికి మూడు వేల మంది వరకు వస్తారు. జన సైనికులు వారిపై ఎదురుదాడికి దిగవద్దు. దాడి చేసే వాళ్లు కత్తు, రాళ్లు తీస్తే.. వారి కాళ్లు, చేతులు కట్టేయండి అని తెలిపారు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్