కెనడా, భారత్ మధ్య దౌత్య విబేధాల వివాదం కొనసాగుతోంది. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యలకు భారత్.. గట్టి కౌంటర్ ఇచ్చింది. ఖలిస్థానీ అనుకూలవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయముందని ఆరోపిస్తున్న తరుణంలో మాటల దాడి సాగుతోంది. భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ట్రూడో గతంలో ఆరోపణలు చేసినప్పుడు, తమ వద్ద ఉన్న నిఘా సమాచారం మాత్రమే ఉందని,.. కానీ పక్కా ఆధారాలు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రూడో తీరుపై విమర్శలు గుప్పించింది. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి ఎన్నో రోజులుగా చెబుతున్నదే రుజువైందని అన్నారు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్. కెనడా తమ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని.. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ స్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని ట్రూడోనే పూర్తిగా బాధ్యుడని తెలిపారు.
ట్రూడో వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన భారత్
0
212
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


