IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. సెంచరీతో చెలరేగిన ఖవాజా

అహ్మదాబాద్: బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగవ టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తైయ్యే సమయానికి ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బౌండరీలతో రెచ్చిపోయిన ఉస్మాన్​ ఖవాజా(Usman Khawaja) 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కామెరూన్​ గ్రీన్ 49పరుగులు చేసి అర్థసెంచరీక ఒక్క పరుగుల దూరంలో ఉన్నాడు. ఓపెనర్​ ట్రావిస్​ హెడ్ ​(32), కెప్టెన్ స్టీవెన్​ స్మిత్​(38) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లు మహ్మద్​ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్​ యాదవ్, జడేజా చెరో వికెట్​ తీశారు. ప్రస్తుతం ఖవాజా, కామెరూన్​ గ్రీన్​ క్రీజులో కొనసాగుతున్నారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ(Narendra Modi) , ఆంటోనీ అల్బనీస్(Anthony Albanese​) ప్రత్యేక వాహనంలో స్టేడియం అంతా తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లకు క్యాప్​లు అందచేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75సంవత్సరాల స్నేహానికి గుర్తుగా.. ఇరు దేశాల ప్రధానులను బీసీసీఐ అధ్యక్షుడు​ రోజర్​ బిన్నీ సన్మానించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్