32.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

హర హర మహాదేవ

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ఆరంభ మయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రో క్తంగా పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జనసేన కోసం ‘సిద్ధం’

జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు నటి అనసూయ వెల్లడించింది. రాజకీయాలపై ఆసక్తిలేదన్న ఆమె రాజకీయపార్టీలు పిలిస్తే ప్రచారం నిర్వహిస్తానంది. అయితే నాయకులు నచ్చాలి… వారి పార్టీ ఏజెండాలు బాగుండాలి అని స్పష్టత నిచ్చింది.

 చిలుకలు వందల టికెట్‌ కొట్టిన కండక్టర్ 

చిలుకలకు టిక్కెట్‌ కొట్టింది KSRTC. బస్సులో ప్రయాణించిన కారణంగా నాలుగు చిలుకలకు 444 రూపాయల టికెట్ కొట్టాడు కండక్టర్‌. బెంగళూరు నుంచి మైసూరుకు తన మనవరాలితో పాటు నాలుగు చిలుకలున్న బుట్టతో KSRTC బస్సు ఎక్కిన మహిళకు ఈ ఘటన ఎదురైంది. తోటి ప్రయాణీకులు అవాక్కవగా నిబంధనల మేరకే టికెట్‌ను ఇచ్చినట్లు అధికారులు సమర్ధించారు. తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు ప్రయాణీకులు సగం టికెట్‌ ధర చెల్లించాలని స్పష్టం చేసారు.

మంత్రితో భేటీ

I T శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసారు టీఎస్‌ ఐఐసీ ఛైర్మన్‌ తూర్పు నిర్మల. వివిధ కార్పోరేషన్ట భర్తీలో భాగంగా ప్రభుత్వం ఈమెను ఐఐసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా మంత్రి శ్రీధర్‌ బాబును మర్యాదపూర్వకంగా కలసిన ఆమె రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధిగా ముందుకు సాగేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు.

రూ.2 లక్షలతో పరార్‌

జనగామ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లా కేంద్రంలో పట్టపగలే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ముందు పార్క్ చేసిన కారు అద్దాలను ద్వంసం చేసి రెండు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ICICI బ్యాంకు లో 2లక్షలు డ్రా చేసిన కడవెండి గ్రామవాసి తుమ్మ ప్రతాప్ రెడ్డి పంజాబ్ బ్యాంకులోకి వెళ్లగా దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ప్రేమ జంట ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసరలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే స్టేషన్‌ వద్ద ఇరువురి మృతదేహాల్ని కనుగొన్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడ్డ గొడవలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. యువతి మృతదేహాన్నివిద్యార్ధిని నిషితగా గుర్తించారు.

కారు ఢీ – వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా మొవ్వ మండలం నిడుమోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చినముత్తేవి గ్రామానికి చెందిన చీలి వీరాస్వామి మృతి చెందాడు. విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న వీరాస్వామిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

‘పిల్లి’ కనబడుటలేదు

కనపడని పెంపుడు పిల్లి కోసం వాల్‌ పోస్టర్లు అంటించాడు ప్రకాశంజిల్లా పొదిలికి చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు మనోజ్‌. అల్లారిముద్దుగా పెంచుకున్నఈ పిల్లి కోసం వీధిలోని సీసీ కెమెరాలను పరిశీలించాడు. నలుగురి దగ్గర ఆరా తీసాడు. అయినా పిల్లి జాడ దొరకలేదు. దీంతో మదనపడ్డ అతను ఇలా పోస్టర్లు అంటించాడు. వినేవారికి ఇది విచిత్రంగా ఉన్నా పిల్లి కోసం అతను పడుతున్న శ్రమ ఫలించాలని స్ధానికులు కోరుతున్నారు.

‘నలిమెల’ ప్రతిభ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ నలిమెల అరుదైన ఘనత సాధించారు. NFTNYC అనే సంస్ధ ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫోటోగ్రఫీ… పోటీల్లో ఎంపికై న్యూయార్క్‌ టైం స్క్వేర్‌ బిల్‌ బోర్డ్‌పై ప్రదర్శితమైంది. ఐదు వేల ఫోటోలు ఈ ఫోటోగ్రఫీ పోటీలో పోటీపడ్డాయి.

మాల్దీవులకు నీటి కొరత

మాల్దీవుల దేశంలో నెలకొన్న తాగునీటి కొరతను అధిగమించేలా పదిహేను వందల టన్నుల తాగునీరును అంద జేసింది సరిహద్దు దేశం చైనా. టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి ఈ నీటిని సేకరించింది. అయితే మాల్దీవులకు పొరుగున ఉన్న దేశాలు తాగునీటిని అందించడం ఇది తొలిసారి కాదు. 2014లో ఆపరేషన్‌ నీర్‌ పేరిట తొలి విడతలో 375 టన్నులు, ఆ తర్వాత INS దీపక్‌, సుకన్య నౌకల ద్వారా రెండు వేల టన్నుల నీటిని అందజేసింది భారత్‌.

ఇద్దరు పైలట్స్‌ తొలగింపు

రన్‌వే క్లియరెన్స్‌ కోసం ఆగి ఉన్నచెన్నై వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రెక్కలను బిహార్‌ రాష్ట్రం దర్భంగాకు వెలుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఢీ కొంది. కోల్‌కత్తా విమానాశ్రయంలో ఈ ఘటన జరగ్గా రెండు విమానాల రెక్కలు బాగా దెబ్బతిన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పౌర విమానయాన DGCA ఇండిగో పైలట్లు ఇద్దర్ని బాధుల్ని చేస్తూ తొలగించింది.

ఇలానే నవ్వుతూ ఉండాలి

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ యజమాని కావ్యా మారన్‌ నెట్టింట వైరల్‌గా మారారు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో SRH భారీ స్కోర్‌ సాధించడంతో గ్రౌండ్‌లో ఆమె చేసిన హవభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న మహిళగా కొందరు నెటిజన్లు పేర్కొనగా, మరికొందరు కంగ్రాట్స్‌ కావ్యా ఈ సీజన్‌ మొత్తం ఇలా నవ్వుతూ ఉండాలి… SRH ఆటగాళ్లు అదరగొట్టాలి అంటూ కామెంట్స్‌ చేసారు.

 

Latest Articles

‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘వచ్చార్రోయ్’ పాట విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందుతోన్న 'మ్యాడ్ స్క్వేర్' కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్