వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి నోరు జారారు. అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదేలే అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కానని చెప్పారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని.. నోటీసులు వస్తే అప్పుడు స్పందిస్తానని అన్నారు.
వైఎస్సార్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను ఎప్పుడూ కాంప్రమైస్ కాలేదన్నారు దానం నాగేందర్. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. నాపై 173 కేసులు ఉన్నాయి. కానీ పేదల ఇళ్లు కూల్చుతానంటే మాత్రం ఒప్పుకోను అంటూ ఫైరయ్యారు. ఇంట్లో లీడర్ల ఫోటోలు పెట్టుకుంటే తప్పా.. అంటూ ప్రశ్నించారు. నా ఇంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి.. ఎవరి అభిమానం వారిది.. నా అభిమానం నాది… అంటూ దానం నాగేందర్ కామెంట్స్ చేశారు.