మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. తనకు న్యాయం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసిన మంచు మనోజ్… మధ్యాహ్నం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యలయానికి వచ్చారు. తనకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అంతేకాదు.. ఫిర్యాదులో మనోజ్ కీలక అంశాలను ప్రస్తావించారు.
గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించి తననే ఇంట్లో ఉండొద్దని బెదిరింపులకు గురిచేశారని వెల్లడించారు. తాను షూటింగ్‌కు వెళ్లి ఉంటానని భావించి, ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. నా భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కంప్లైంట్‌లో మనోజ్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై.. మోహన్ బాబు ఫిర్యాదు ఆధారంగా మనోజ్‌పై కేసులు నమోదు అయ్యాయి.