29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

తీన్మార్ మల్లన్నకు ఎన్ని నాలుకలు?

ఎక్కడుంటే అక్కడి రంగు పులుముకునే ఊసరవెల్లి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేస్తోంది. పూటగడిపేందుకు ఏ కండువా అయినా కప్పుకునే పొలిటికల్‌ ఊసరవెల్లి అతడు. ప్రమాదం వస్తే.. ఏ పార్టీ గొడుగు కిందకు అయినా చేరిపోయే ఊసరవెల్లి. ఏరుదాటగానే తెప్పతగలేసే ఊసరవెల్లి. తిన్న కంచంలోనే మన్నుపోసే ఊసరవెల్లి. ఇలా ఆ మనిషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! ఎక్కడి ఎత్తులు అక్కడే… ఎప్పటి రాజకీయం అప్పుడే..! ఇలా పూటకో రాజకీయం చేస్తూ ఎమ్మెల్సీ వరకు వచ్చాడు చింతపండు రవి అలియాస్ తీన్మార్ మల్లన్న.

మల్లన్న అంటే మామూలు మనిషి కాదు. మల్లన్న వెనుక ఓ మానిటర్ ఉంటుంది. పొద్దుపొద్దుగాలనే యూట్యూబ్ లో ఆయన లైవ్ ఉంటుంది. మానిటర్ వెనుక పెట్టుకుని కెమెరా ముందు పెట్టుకుని… లైవ్ లోనే మస్తు ముచ్చట్లు చెప్పుడు మల్లన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విద్యను నేర్చుకునేందుకు మందికాడనే పైసలు అడుక్కున్న చరిత్ర మలన్న సొంతం. మీ ఛాయ్ పైసలు ఇస్తే నా బతుకు బాగుపడతది అంటూ చేయిచాచిన మల్లన్న నేడు రాజకీయంలో రాటుదేలి హెలిక్యాప్టర్ ఎక్కే లెవల్ కు చేరుకున్నాడు.

ఇప్పుడు హెలిక్యాప్టర్ మాట ఎత్తాం కాబట్టి.. బీసీ బిడ్డ ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మల్లీ అదే యూట్యూబ్ ఛానల్ లోనే తిట్టడం మల్లన్నకు షరా మామూలే..! ఆయనను విమర్శిస్తే ప్రశ్నించినట్లు… ఆయన్ను విమర్శిస్తే తప్పు చేసినట్లు..! ఇది మల్లన్నకు తెలిసిన పొలిటికల్‌ నీతి. ఇంతటి నిజాయితీమంతుడు కాబట్టే.. బీఆర్ఎస్ హయాంలో కేసుల భయంతో బీజేపీలో చేరి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నాడు. నాడు భద్రత కోసం కాషాయ కండువా కప్పుకున్న మల్లన్న.. నేడు పదవి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు.

అవసరాల కోసం రాజకీయ నాయకులు కండువాలు మార్చడం పరిపాటే అయినా.. ఈ విషయంలో మలన్న రూటే సపరేటు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే విమర్శించడం.. సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు ఎక్కుపెట్టడం మలన్న నైజం. గతంలో బీజేపీని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిన మల్లన్న… కేసుల భయంతో అదే పార్టీలో చేరి ఉపశమనం పొందారు. ఆ తర్వాత ఎన్నికలు రాగానే.. కాంగ్రెస్ పార్టీని ఆకాశానికి ఎత్తేశారు. ఆహా రేవంత్… ఓహో రేవంత్ అంటూ గంతులేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ప్రకటిస్తున్నప్పుడు చూడాలి మల్లన్న అసలు రూపం. ఒక లిస్ట్ రిలీజ్ కాగానే కాంగ్రెస్ పార్టీ మంచిదన్న మల్లన్న రెండో లిస్ట్ రిలీజ్ చేయగానే కాంగ్రెస్ పార్టీని విమర్శించేవారు.

కులాల కేంద్రంగా యూట్యూబ్ ఛానల్ లో మల్లన్న చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల సమయంలో మల్లన్న వాడని కులం కార్డు లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ తో కాస్త సన్నిహితంగా ఉండి పట్టభద్రుల ఉపఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని విజయం సాధించిన మల్లన్న ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో అగ్రకులాల నాయకులే లక్ష్యంగా విమర్శలు చేస్తూ.. తనలోని పామును బుసలు కొట్టిస్తున్నారు.

తెలంగాణకు చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని మల్లన్న వరంగల్ బీసీ గర్జనలో కామెంట్ చేసినా.. పార్టీ వివరణ కోరకపోవడం ఏంటో కాంగ్రెస్ పార్టీకే తెలియాలి. అసలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణా కమిటీ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవసరానికో కులం కార్డు వార్డుకుంటూ తిరిగే మల్లన్న.. ఇప్పుడు బీసీ కార్డు బయటకు తీయడం వెనుక పెద్ద ప్లానే ఉందని ప్రచారం జరుగుతోంది. రాబోయో రోజుల్లో మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడన్న దళిత నేత మోత్కుపల్లితో బీసీ గర్జన సభా వేదికపైనే చెప్పించాడంటే.. మల్లన్న రాజకీయం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం బీసీ కులగణన కేంద్రంగా మల్లన్న రాజకీయాలు సాగుతున్నాయి. ఎన్నికలప్పుడు బీసీ పట్టభద్రులు మాత్రమే తనకు ఓటు వేయాలని చెప్పని మల్లన్న ఇప్పుడు బీ సీమంత్రం జపిస్తూ.. కాంగ్రెస్ లోని రెడ్డి నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జానారెడ్డిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ మల్లన్న వ్యవహరిస్తున్న తీరు… అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీలోనే ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు మలన్నను లైట్ తీసుకుంటుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్