22.9 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

మస్తాన్‌ సాయి లీలలు… వీడు మామూలోడు కాదు

మస్తాన్‌ సాయి లీలలు మామూలుగా లేవు. ఇతగాడి అరాచకాలకు అంతే లేదు. తవ్వే కొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. సినీ నటుడు రాజ్‌ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్‌ సాయి వ్యవహారం బయటకు వచ్చింది.

యువతులు, మహిళలకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ వీడియోలను చిత్రీకరిస్తున్నాడని లావణ్య నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 80 నగ్న వీడియోలు, ఫోటోలున్న హార్డ్‌ డిస్క్‌ను సైతం ఆమె పోలీసులకు అందజేసింది. దీంతో మస్తాన్‌ సాయిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్‌ ఖాజాను కూడా అరెస్టు చేశారు ఇప్పటికే మస్తాన్‌ సాయిపై హైదరాబాద్‌, విజయవాడలో డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయి.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. మస్తాన్‌ సాయి వ్యవహారంలో కొత్త విషయాలు తెలిసాయి. మస్తాన్‌ సాయిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లే యువతులు, మహిళలను బెదిరించినట్టు తేలింది. గతంలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫ్యాన్‌కి ఉరి బిగించుకుని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసినట్టు తెలుస్తోంది. సుమారు వంద మందికి పైగా మహిళలను ఇలా మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక రికార్డు చేసిన వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులను మస్తాన్‌ సాయి అసభ్యకరంగా తిడుతూ వారిని మానసికంగా వేధించేవాడని కూడా తేలింది. ఈ నేపథ్యంలోనే నిందితుడిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ చేయబోతున్నారు.

మస్తాన్‌ సాయిపై లావణ్య ఫిర్యాదులోని అంశాలు

మస్తాన్‌సాయి బీటెక్‌ చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు. అతను ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా 2022లో పరిచయమయ్యాడు. యువతులు, వివాహితల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్‌ చేస్తాడు. గూగుల్, ఐ-క్లౌడ్‌లోని వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడతాడు. బాధితులకు డ్రగ్స్‌ ఇచ్చి లైంగికవాంఛ తీర్చుకుంటాడు. వీడియోలు చిత్రీకరించి హార్డ్‌డిస్కులో దాచేస్తాడు. గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వరలక్ష్మీ టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ను హ్యాక్‌ చేసి వీడియోలు సేకరించాడు.

నటుడు నిఖిల్‌ ఫోన్‌లోని ప్రైవేటు పార్టీ వీడియోలు సైతం మస్తాన్‌ హార్డ్‌డిస్కులో ఉన్నాయి. మస్తాన్‌సాయి నాకు తెలియకుండానే నా వ్యక్తిగత వీడియోలు తీశాడు. వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మస్తాన్‌సాయి ఆకృత్యాలున్న హార్డ్‌ డిస్కును గతేడాది నవంబరులో నేను తీసుకున్నా. దాంతో మా ఇంట్లోకి చొరబడి నాపై దాడి చేశాడు. నన్ను అంతం చేసి హార్డ్‌డిస్కు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదిలా ఉంటే లావణ్య సైతం రెండు డ్రగ్స్‌ కేసుల్లో నిందితురాలు.

Latest Articles

అర్జెంటినాలో అధికారులు అర్జంట్ గా చేస్తున్న పని ఏమిటో తెలుసా…? సరండీ నది సరౌండింగ్స్ క్లీనింగ్ కు ప్లానింగ్

పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు...ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్