రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. క్రిమినల్స్ కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఫైరయ్యారు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయడంలో కులం అడ్డొస్తోందా ? అని ప్రశ్నించారు. నేరం చేసిన వారు బయట తిరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎస్పీలు, అధికారులు..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.