స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏప్రిల్ మాసంలో 20.95 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించకున్నారు. ఏప్రిల్ లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 114.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 11.01 కోటి లడ్డూల విక్రయంతో పాటు 42.64 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినట్లు తెలిపారు. 9.03 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. మే 14 నుంచి 18వ తేదీ వరకు హనుమజ్జయంతి సందర్భంగా ఆకాశగంగ, జపాలి, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏడవ మైలు ఆంజనేయస్వామి, నాదనీరాజనం వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.