కొత్తగా వాహనం కొన్నాలనుకునే వారికి హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా హీరో వాహనాల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా పెరిగిన ఉత్పత్తి వ్యయ భారాన్ని తగ్గించేందుకు ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. మోడల్‌ని బట్టి దాదాపు 2శాతం మేర ధరల పెంపు ఉంటుందని తెలిపింది. తాజా నిర్ణయంతో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి.