ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు ఉందా?లేదా? అనే దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తుపై బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి ఎంత సహకారం అందిందో ప్రజలే ఆలోచించాలని తెలిపారు. కేంద్రంలోని మోదీని పొగుడుతారని.. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలను ఎదగనివ్వరని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ-జనసేన పొత్తు ఉండకూడదని కొంతమంది కోరుకుంటున్నారని.. వారి కోరిక ఎప్పటికీ ఫలించదని స్పష్టంచేశారు. కాగా బీజేపీ తమతో కలిసి రావడం లేదని ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత మాధవ్ జనసేననే తమతో కలిసి రావడం లేదని కౌంటర్ ఇచ్చారు. దీంతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా?లేదా? అనే చర్చ మొదలైంది.
బీజేపీ నేతలను ఏపీలో ఎదగనివ్వడం లేదు: సోము వీర్రాజు
0
307
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


