24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

Heavy Rains Alert: భారీ వర్ష సూచన.. మరో 3 రోజులు విస్తారంగా వర్షాలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు(heavy rains) పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(North Telangana), కోస్తాంధ్ర(Coastal Andhra), ఉత్తరాంధ్ర(Uttarandhra) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాతావరణమే దీనికి కారణంగా తెలుస్తోంది.

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో ఓ  అల్పపీడనం ఏర్పడింది. దట్టమైన మేఘాలకు బలమైన గాలులు తోడవడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. అటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా మేఘాలు ఏర్పడే అవకాశాలున్నాయి.

ఏపీలో విజయవాడ, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలోని వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు రావచ్చు. ఇవాళ్టి నుంచి  తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాల్లో చిరు జల్లులు లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు. రాత్రికి ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు ప్రారంభం కావచ్చు.

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్