దిగొచ్చిన యాజమాన్యం.. గంగవరం పోర్టు కార్మికులకు హామీలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: గంగవరం పోర్టు(Gangavaram Port) నిర్వాసితుల ఆందోళనతో యాజమాన్యం దిగి వచ్చింది. కార్మికుల డిమాండ్లకు(Workers’ Demands) రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. మీడియాతో ఆర్‌డీఓ హుస్సేన్ సాహెబ్ అదానీ(RDO Hussain Saheb Adani) పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడారు. ప్రతీ కార్మిక కుటుంబానికి వన్ టైం పేమెంట్ కింద రూ.10 వేలు వెంటనే చెల్లించే విధంగా అంగీకరించింది. వార్షిక ఇంక్రిమెంట్(Annual Increment) ఐదు శాతంతో పాటు అదనంగా ఏప్రిల్ 24 నుంచి ప్రతీ కార్మికునికి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. డెత్ బెనిఫిట్స్(Death Benefits) కింద ఈఎస్ఐ(ESI) నిబంధనల మేరకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.

తొలగించిన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోర్టు యాజమాన్యం అంగీకరించింది. అదానీ యాజమాన్యం రాక ముందు తొలగించిన ఇద్దరు కార్మికులను మాత్రం తీసుకునేందుకు అంగీకరించలేదు. అలాగే దీక్షలు చేస్తున్న సమయానికి జీతాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ హామీలతో బ్యాంకు రుణాలకు ఆర్డీవో హామీ ఇచ్చారు. యాజమాన్య హామీలను కార్మికులకు ఆర్డీవో వివరించారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్