ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. లిక్కర్‌ స్కాంకు సంబంధించి పలుమార్లు ఈడీ విచారణకు హాజరైన తర్వాత గతేడాది మార్చిలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

     గత నెల ఫిబ్రవరి 28న ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు లిస్ట్ అయ్యాయి. అయితే, ఇతర పిటిషన్లపై విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ ను రీచ్ కాలేదు. దీంతో కవిత తరఫు సీని యర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఆమె పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్​లో ఉండగానే ఈడీ మళ్లీ నోటీసులిచ్చిందని, కావున పిటిషన్​పై త్వరగా విచారణ చేట్టా లని అభ్యర్థించారు. తదుపరి విచారణకు రెండు రావాల టైం కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకు న్న బెంచ్.. విచారణకు సమయం లేనందున మార్చి 13 తర్వాత విచారిస్తామని, ఈలోపు ఇరు పక్షాలు తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్