హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన

        లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ స్పీడు పెంచింది. మెజారిటీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మలివిడత ప్రచారంలో మోదీ పాల్గొనను న్నారు. బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో రోడ్‌షోలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తొలివిడత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌, పటాన్‌చెరు విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు. పది రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు.

      కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రెండు రోజుల కిందట వచ్చి, సంస్థాగత బలోపేతంపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌తో పాటు పార్టీ పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, ఆ పైస్థాయి క్యాడర్‌తో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయి పోలింగ్‌ బూత్‌ల పటిష్ఠత ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఇవాళ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన రెండు రోజుల పాటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షోను నిర్వహించినట్లు గానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్‌ చేస్తోంది. మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అనుగుణంగా మల్కాజ్‌గిరి, సికిందరాబాద్‌, హైదరాబాద్‌ సెగ్మెంట్లకు కలిపి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్‌ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా 1.3 కి.మీ మేర ఈ రోడ్‌ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 4.50 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. మల్కాజ్‌గిరి చౌరస్తాలో ప్రసంగిస్తారు. అనంతరం, ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి నాగర్‌కర్నూలులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ లోక్‌సభ స్థానాలు లక్ష్యంగా మోదీ ప్రచారం జరగనుంది. ఈ నెల 18న మోదీ జగిత్యాల బహిరంగ సభలోనూ పాల్గొంటారు ప్రధాని మోదీ. కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా మోదీ ప్రచారం చేయనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్