‘యమధీర’ టీజర్ లాంచ్ చేసిన అశోక్ కుమార్

కన్నడ నటుడు కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘యమధీర’. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ రిలీజ్ చేశారు.

ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ…‘‘ఇది నా మొదటి చిత్రం. సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశా. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన నా స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది’’ అని తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ… ‘‘నా స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ గారు ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే దూకుడు ని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం’’ అని తెలిపారు.

ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

టెక్నికల్ టీం :
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పీఆర్వో : మధు వీ ఆర్

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్