లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సీబీఐ ఇంటరాగేషన్ చేయడాన్ని ఎమ్మెల్సీ కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5న ప్రత్యేక న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికా రులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం.
కవిత పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
0
184
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


