కామారెడ్డి జిల్లా అంబర్పేట్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో తమ్ముడిపై ఆన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలంకలం రేపింది. శ్రీకాంత్ అనే యువకుడిపై అన్న దేవరాజు దాడి చేశాడు. శ్రీకాంత్, దేవరాజు ఇద్దరు అన్నదమ్ములు కాగా,వీరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఈనేపథ్యంలోనే వారి మధ్య మరోసారి వివాదం చెలరేగడంతో దేవరాజు సహనం కోల్పోయి తమ్ముడిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్‌ను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.