Guntur couple Missing in America Snow Storm News: మంచు నీటి సరస్సులో షికారు: ప్రమాదవశాత్తూ మంచు పలకలు విరగడంతో పడిపోయిన దంపతులు, భార్య మృతి, భర్త, స్నేహితుని కోసం గాలింపు, పిల్లలు సురక్షితం
అందరిలాగే ఆ దంపతులు కూడా ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టారు.ఇద్దరు పిల్లలు కలిగారు. సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. క్రిస్మస్ సెలవుల్లో అందరూ వేకెంట్ కి వెళుతుంటే, వీళ్లు ఫీనిక్స్ వెళ్లారు. స్నేహితుడు, వీళ్లిద్దరు, పిల్లలు అంతా కలిసి బోట్ పై మంచునీటి సరస్సుపై వెళుతుండగా ఆ పలకలు పగిలి వీరిద్దరూ పడిపోయారని తెలిసింది. వివరాల్లోకి వెళితే…
అమెరికాలో మంచు తుఫాన్లు భారతీయుల్ని వణికిస్తున్నాయి. అతి శీతల గాలులు, మంచు తుఫాన్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అమెరికాలో చాలా కీలకం అని చెబుతారు. అయితే క్రిస్మస్, న్యూఇయర్ కావడంతో అందరూ రిస్క్ తీసుకుని బయటకు వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అందువల్ల ఈ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువ దంపతులు ఇలా చిక్కుకుపోయారు. ఇద్దరు పిల్లలు, స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫీనిక్స్ లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగిపోవడంతో వీరు ముగ్గురు పడిపోయారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చిన్నారులకు ఏం జరగలేదని తెలిసింది.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన సత్యనారాయణ, హరిత దంపతులు అమెరికా వెళ్లారు. వీరు అరిజోనాలో నివాసం ఉంటున్నారు. అక్కడ తీవ్ర మంచు తుపాను కారణంగా వీరు మంచులో చిక్కుకుపోయారు. దీంతో గాలింపులో భార్య మృతదేహం దొరికింది. భర్త సత్యనారాయణ కోసం ఇంకా గాలిస్తున్నారు. అయితే జూన్ నెలలో వారు స్వగ్రామం వచ్చి వెళ్లారని బంధువులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులు, చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.