పార్టీ కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పట్టించుకోలేదని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్నచూపు చూశారని తెలిపారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్‌బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. రాబోయే రోజుల్లో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు గ్రంధి శ్రీనివాస్.