దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింగ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్‌లో ఆమోద ముద్ర వేశారు. మార్చి 14న మొత్తం 18వేల 629 పేజీలతో జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదికను అందజేసింది.