మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు రిమాండ్

     బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రణీత్ రావును ఈ నెల 4న ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అనతరం జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి‌ హెడ్‌గా ఓ టీంను నియమించారు.

Latest Articles

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం 'చెరువుకొమ్ముపాలెం'లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12),...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్