కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ మార్తల రజిని ని అరెస్టు చేసారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్ అక్రమా స్తులపై సోదాలు నిర్వహించిన అధికారులు మూడు కోట్ల 21 లక్షల రూపాయల విలువగల ఆస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 12 కోట్లుగా ఉంటుందని అంచనా. హన్మకొండలోని ఆమె నివాసంతో పాటు సన్నిహి తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు ఆమెకు సంబంధించి రెండు బ్యాంకు లాకర్లను తెరిచారు. 22 ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలతోపాటు బ్యాంకు ఖాతాలో 25 లక్షల రూపాయల నగదును గుర్తించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, లక్షా 50వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ వలలో చిక్కిన తహశీల్దార్
0
267
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


