Former MLA Neeraja Reddy | ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలి… వారు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నీరజారెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈమె 2009లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. నీరజారెడ్డి మృతితో కుటుంబికులతోపాటు స్థానిక బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది.
బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే దుర్మరణం
0
326
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


