Nara Lokesh | పబ్లిసిటీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి… పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఏమాత్రం తగ్గడం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ తలపెట్టిన యువగళం పాదయాత్ర నేటికి 72వ రోజుకి చేరుకుంది. ఈ పాదయాత్ర నేడు పత్తికొండ నియోజకవర్గంలో సాగింది. పాదయాత్రలో అడుగడుగునా వైసీపీ అక్రమాలను ఎండగట్టారు నారా లోకేష్. పత్తికొండ నియోజకవర్గంలో టిడిపి ప్రభుత్వం పథకాలు, నిర్మాణాలకు రంగులు వేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకుంటున్నారని అక్కడి ఫోటోలను చూపిస్తూ ట్విట్టర్ లో ఆయన మండిపడ్డారు.
టీడీపీ పాలనలో పత్తికొండ నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల పథకం కింద సుజల మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్లాంటుకి వైసీపీ స్టిక్కర్లు రంగులేసి నిలిపేశారని అన్నారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గంలోని 68 గొలుసుకట్టు చెరువులకు నీరు నింపేందుకు రూ.253 కోట్ల నిధులతో టీడీపీ ప్రభుత్వం 70 శాతం పూర్తిచేసిందన్నారు. ఆ పనులను ఇప్పడు వైసీపీ పాలకులు ఆపేశారని గళమెత్తారు.