ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నీట్ సజావుగా జరిపేందుకు 2 లక్షల సిబ్బందితో మాక్ డ్రిల్ చేపట్టింది ఎన్టీఏ (NTA). మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిముషాల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిముషాల వరకు ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇస్తారు. నీట్ పరీక్ష రాసేందుకు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎంబీబీఎస్, BDS,ఆయుష్ మెడికల్ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల అడ్మిషన్ కోసం ప్రతి ఏడాది నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది ఎన్టీఏ. ఎయిర్ ఫోర్స్, ట్రాన్స్ పోర్ట్ విమానాల ద్వారా క్వశ్చన్ పేపర్లను రాష్ట్రాలకు పంపిణి చేసింది ఎన్టీఏ(NTA).
దేశ వ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
0
44
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


