22.7 C
Hyderabad
Thursday, November 30, 2023
spot_img

మల్టీప్లెక్స్‌లో రూ.112కే ‘ద్రోహి’ సినిమా

సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ జంటగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ద్రోహి’. ద క్రిమినల్‌ అన్నది ఉపశీర్షిక. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా చిత్ర బృందం సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిగుణ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం. ఈ టీమ్‌ అంతా ప్రేమతో ఈ చిత్రం చేశారు. సక్సెస్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరులో టీజర్‌లో కనిపించింది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.’’ అని అన్నారు.

హీరో సందీప్‌ మాట్లాడుతూ “ద్రోహి’ టైటిల్‌ వినగానే వెంటనే ఓకే చేసేశా. నాగార్జున నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే కమల్‌హాసన్, అర్జున్ నటించిన ఓ సినిమాను ద్రోహి టైటిల్‌తో విడుదల చేశారు. అందుకే అదే టైటిల్‌ అనుకున్నారు. దానికి శీర్షికగా ‘ద క్రిమినల్‌’ అని పెట్టాం. అద్భుతమైన డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. క్రిమినల్‌ అనగానే క్రైమ్‌, థ్రిల్లర్‌ అనుకుంటాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఈ నెల 13న నేషనల్‌ సినిమా డే సందర్భంగా సినీ ప్రియులకు మల్టీప్లెక్స్‌లో రూ.112లకే టికెట్‌ ఆఫర్‌ పెట్టాం’’ అని అన్నారు.

హీరోయిన్ డెబా డాలీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అవకాశం ఓ కలలాగా ఉంది. ఈ సినిమాలో భాగం చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు, తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ” ఏడాది క్రితం ఈ జర్నీ మొదలైంది. సినిమా అనగానే అందరికీ కష్టాలుంటాయి. అవే మేమూ అనుభవించాం. నాకు మంచి టీమ్‌ దొరికింది. ఏదైనా మనసుపెట్టే తీశాం. ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషన్‌కు ఖర్చుపెట్టే బడ్జెట్‌తో మా సినిమా చేశాం. నేను అద్భుతంగా తీశానని చెప్పను, కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను. సినిమా నిరాశ పరచదని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు.

నటీనటులు:
సందీప్‌కుమార్‌, దీప్తి వర్మ, చందు ఛార్మ్స్‌(చంద్రిక గొల్లపూడి), మహేష్‌విట్ట, మజిలి శివ, నీరజ్‌, డెబ్బిడాలీ, తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: అశోకదార్బీరు,
సంగీతం: అనంత నారాయణ్‌
ఎడిటర్‌: జానీ బాషా
పిఆర్‌ఓ : మధు విఆర్‌
నిర్మాతలు: విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి డి
దర్శకత్వం: విజయ్‌ పెందుర్తి

Latest Articles

హైదరాబాద్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్ నగరంలో ఓటింగ్ ఏర్పాట్లను సిద్దం చేశారు అధికారులు.  రేపు సాయంత్రానికి ఎన్నికల క్యాంపెయిన్  ముగుస్తుండటంతో అందరూ అధికారులు పోలింగ్ పై ఫోకస్ చేయనున్నారు.  డిసెంబర్ ఒకటిన ఉదయం  సరిగ్గా ఏడు గంటలకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్