20.2 C
Hyderabad
Tuesday, December 5, 2023
spot_img

Deep Fake video: జారా పటేల్ ఎవరు? రష్మిక వైరల్ వీడియోతో సంబంధమేమిటంటే?

స్వతంత్ర వెబ్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సోషల్ మీడియా(Social Media)ను ఆసరాగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్‌తో అభ్యంతరకరంగా వీడియోను(Deep Fake Video) మార్ఫింగ్ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేసిన తీరు వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై అమితాబ్ నుంచి తెలుగులో నాగచైతన్య వరకూ అందరూ ఖండించారు. అయితే రష్మిక మందన్న వీడియోగా మార్పింగ్ చేసిన ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఎవరు? ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే..

ప్రస్తుతం రష్మిక మందన్న(Rashmika Mandanna) గా భావించే అసలు వీడియో జరా పటేల్‌(Zara Patel)ది. ఆమె ఒక లిఫ్టులో దిగిన వీడియోను మార్ఫింగ్(Morphing) చేసి రష్మిక మందన్న(Rashmika Mandanna) తలను అతికించారు. మార్పింగ్ అనంతరం దానిని మీడియాలో వదిలారు. అయితే కొందరు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఏదో తేడాగి ఉంది అని గుర్తించారు. అనంతరం రష్మికది ఫేక్ వీడియో(Fake Video) అని స్పష్టీకరించారు. ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి నేషనల్ క్రష్‌కు మద్దతు లభించింది.

ఇక జారా పటేల్(Zara Patel) విషయానికి వస్తే.. భారత సంతతికి చెందిన బ్రిటన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(Britain Social Media Influencer). ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెను 4.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె అడల్డ్ కంటెంట్(Adult content) క్రియేట్ చేయడంలో పాపులర్. ఆమె వీడియోలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అడల్డ్ కంటెంట్ క్రియేషన్ పక్కన పెడితే.. ఆమె వృత్తి డాటా ఇంజనీర్‌గా, మెంటల్ హెల్త్ నిపుణురాలిగా(Mental health professional) పనిచేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను జారా పటేల్(Zara Patel) అక్టోబర్ 9వ తేదీన ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో పోస్టు చేశారు. నల్లటి బికినీ లాంటి డ్రస్‌ను ధరించిన వీడియోను.. నా ముఖం మీదే ఎలివేటర్ డోర్ మూసేశారు అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియోకు 6 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను ఆధారంగా చేసుకొని మార్ఫింగ్(Morphing) చేసి రష్మిక తలను అతికించడంతో జారా పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది.

జారా మార్ఫింగ్ వీడియోపై రష్మిక మందన్న(Rashmika Mandanna) స్పందిస్తూ.. ఈ వీడియోను షేర్ చేయడానికి, దాని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. డీప్ ఫేక్ వీడియో(Deep fake video) ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇది నాకే కాదు.. ప్రతీ మహిళ ఆందోళన చెందాల్సిన విషయంగా మారింది. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం దారుణంగా అనిపిస్తుంది అని రష్మిక సోషల్ మీడియాలో స్పందించారు.

రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన ఆమె ప్రస్తుతం యానిమల్(Animal) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి హాట్ హాట్‌గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏమిటి?

డీప్ ఫేక్‌కి(Deep fake) సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. నిజానికి డీప్ ఫేక్ టెక్నాలజీ(Deep fake technology) సహాయంతో మరొకరి ఫోటో లేదా వీడియోలో ఉన్న ప్రముఖ వీడియో ముఖంతో ముఖం మార్చబడుతుంది. అవి పూర్తిగా వాస్తవమైనవిగా కనిపిస్తాయి. కానీ నిజమైనవి కావు. వాటిలో ఉన్న వ్యక్తి నిజం కాదు. ఇది పూర్తిగా ఫేక్ వీడియో అయినప్పటికీ ప్రజలు సులభంగా నమ్మేంత నిజంగా ఉంటుంది. ఏదైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం ప్రమాదకరం. డీప్‌ఫేక్‌లు, నకిలీ వార్తలు కూడా దీనికి ఉదాహరణ. ఈ టెక్నాలజీ సహాయంతో ఎవరైనా పరువు తీయవచ్చు. డీప్‌ఫేక్‌ల వాడకం ముఖ్యంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుంటుంది. తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుండి ఏ వ్యక్తి ప్రైవేట్ ఫోటోను తీసి నకిలీ పోర్న్ వీడియోలను తయారు చేయవచ్చు. ఏ నాయకుడైనా ఎంఎంఎస్ (MMS) చేయవచ్చు. ఈ సాంకేతికత సహాయంతో అతను ఎప్పుడూ ఇవ్వని ప్రసంగాల వీడియోలను విడుదల చేయవచ్చు.

Latest Articles

రంగంలోకి డీకే.. అసలేం జరగబోతోంది?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనాలు రావడం, అలాగే హంగ్ ఏర్పడే అవకాశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్