Dantewada Naxal attack | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 10 మంది జవాన్లు దుర్మరణం చెందారు. వీర జవాన్ల మృతి వారి కుటుంబాల్లోని కాకుండా… రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజల గుండెల్లో విషాదాన్ని నింపింది. వీరి మరణం పట్లా గురువారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మృతులకు నివాళులర్పించారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదాల మధ్య జవాన్ల మృతదేహాలను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం భూపేశ్.. ఓ శవపేటికను మోస్తూ వాహనం వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం భూపేశ్ మాట్లాడుతూ.. జవాన్ల త్యాగాలు ఎప్పటికి వృథాగా పోవన్నారు. అమర జవానులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులను మట్టిలో కలిపేందుకు జరుపుతోన్న ఈ పోరును మరింత తీవ్రం చేస్తామని వెల్లడించారు.
దంతెవాడ నక్సల్స్ అట్టాక్… జవాన్ శవపేటిక మోసిన సీఎం భూపేశ్
0
301
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


